Telangana GST Scam: తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రాష్ట్రంలో జరుగుతున్న ఒక భారీ జీఎస్టీ (GST) కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. ఈ అక్రమాల్లో సుమారు రూ. 84.15 కోట్ల విలువైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మోసం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Telangana RTC Strike News: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
నిందితుడి అరెస్ట్, రిమాండ్
ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్‌కేజీ (SKG) ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్ సందీప్ కుమార్ గోయల్ ను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు.నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించిన నిందితుడు సందీప్ కుమార్ గోయల్.. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు.అయితే ఈ ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ మాత్రమే కాకుండా.. సందీప్ కుమార్ గోయల్‌కు సంబంధం ఉన్న ఇతర కంపెనీల్లోనూ అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది.
ఈ క్రమంలో వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన అధికారులు.. సందీప్ కుమార్ గోయల్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు. ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ద్వారా సందీప్ కుమార్ గోయల్.. ఎలాంటి వస్తువులు అమ్మకుండానే.. కేవలం పేపర్ల మీదే ఇన్‌వాయిస్‌లను తయారు చేసి కోట్ల రూపాయల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను నిబంధనలకు విరుద్ధంగా క్లెయిమ్ చేసినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: