📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Smita Sabharwal : రూ.61 లక్షల వెహికల్ అలవెన్స్.. స్మితకు నోటీసులు?

Author Icon By Sudheer
Updated: March 20, 2025 • 8:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) వెహికల్ అలవెన్స్ (Vehicle allowance) కోసం జయశంకర్ వర్సిటీ (Jayashankar University) నుంచి భారీగా నిధులు తీసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 2016 నుంచి 2024 వరకు తన వాహన ఖర్చుల కోసం నెలకు రూ. 63,000 చొప్పున మొత్తం రూ. 61 లక్షలు అద్దె కింద తీసుకున్నట్లు ఇటీవల ఆడిట్ నివేదికలో తేలింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియడంతో, వర్సిటీ నిర్వాహకులు ఆమెకు నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు.

వ్యక్తిగత అలవెన్స్ తీసుకోవడం సరైనదేనా?

వర్సిటీ నిధుల నుండి వ్యక్తిగత అలవెన్స్ తీసుకోవడం సరైనదేనా? అనే ప్రశ్నపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా స్మితా సబర్వాల్‌కు ఇప్పటికే వాహన సదుపాయాలు ఉంటాయని, పైగా ఈ తరహా చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమని ఆడిట్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో ఆమె ఈ నిధులను పొందారని వెల్లడైంది.

ప్రభుత్వ నిధుల వినియోగంపై మరోసారి పెద్ద చర్చ

ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. స్మితా సబర్వాల్ నుండి ఈ మొత్తం తిరిగి రాబట్టే చర్యలు చేపట్టాలని వర్సిటీ బోర్డు సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల వినియోగంపై మరోసారి పెద్ద చర్చ మొదలైనప్పటికీ, స్మితా సబర్వాల్ ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.

Google News in Telugu Rs. 61 lakh vehicle allowance Smita Sabharwal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.