తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) తన ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలోని తహసీల్దార్ (Talakondapalli Tahsildar) కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. రైతు నుంచి డిమాండ్ చేసిన లంచాన్ని స్వీకరిస్తుండగా వారిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.తలకొండపల్లి మండలానికి చెందిన ఓ రైతు తన కుటుంబ సభ్యుల పేరిట 22 గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడు. అయితే తహసీల్దార్ బి. నాగార్జున, అటెండర్ యాదగిరి కలిసి ఈ పని పూర్తిచేయాలంటే రూ.10,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తమ చేతిలో పని ఉండిపోయిన బాధితుడు ఆలోచించకుండా ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
ఏసీబీ ప్లాన్ ప్రకారం రెడ్ హ్యాండెడ్ పట్టివేసిన దృశ్యం
రైతు ఫిర్యాదుతో అలర్ట్ అయిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుదారు లంచం ఇవ్వగా (While giving a bribe), అక్కడే మాటువేసిన అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.ఈ ఘటన అనంతరం ఏసీబీ అధికారులు ప్రజలకు స్పష్టం చేశారు. లంచం అడిగే ప్రభుత్వ ఉద్యోగులపై భయపడకండి, వెంటనే ఫిర్యాదు చేయండి అని చెప్పారు. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ @TelanganaACB, లేదా https://acb.telangana.gov.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్న హామీ కూడా ఇచ్చారు.
అవినీతి చరిత్రకు ముగింపు తెలుపండి
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లంచం అడిగే వారిపై నిర్భయంగా పోరాడాలని ఏసీబీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఈ తరహా చర్యలు జరిగే సూచనలతో, అవినీతి అధికారుల్ని చుట్టుముట్టే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.
Read Also : Amaravati : ల్యాండ్ పూలింగ్ స్కీం విధి విధానాలు జారీ