📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Road Safety: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి

Author Icon By Pooja
Updated: January 17, 2026 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం యువతే ఎక్కువగా రోడ్డు ప్రమాదలకు(RoadSafety) బలవుతున్నారని ఆందోళన మీ కోసం కాదు… మీ కుటుంబం కోసం హెల్మెట్ అతివేగం కుటుంబాలను అనాథల్ని చేస్తుంది.

Read also: TG: మరోసారి వాయిదా పడిన ఉన్నత విద్యా మండలి ఇసి మీటింగ్

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు పరేడ్‌కు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి, అధికారులు మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం (ఫిజికల్ ఫిట్‌నెస్) ఎంతో అవసరమని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

“Arrive Alive” రోడ్డు భద్రత(RoadSafety) అవగాహన కార్యక్రమంలో భాగంగా సిబ్బందిని ఉద్దేశించి జిల్లా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి, నిర్ణీత వేగ పరిమితుల్లో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు. అధిక వేగం, అజాగ్రత్త వాహన నిర్వహణ కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో జరిగిన హత్యల కంటే కూడా రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో యువత శాతం ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని పేర్కొంటూ, ప్రతి యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బంది ఇంటి నుండి బయలుదేరి క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు వారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తారని, అందువల్ల రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు.

చివరగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు సిబ్బందితో కలిసి ఈ క్రింది రోడ్డు భద్రత ప్రతిజ్ఞను పఠనం చేశారు:

నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనాల చట్టంలో పొందుపరచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢసంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాయక్, సీఐలు శ్రీ జార్జ్, శ్రీ మహేష్, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ArriveAlive Google News in Telugu Latest News in Telugu MedakPolice

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.