📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : Roads – వర్షంతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు శాశ్వత మరమ్మతులు

Author Icon By Shravan
Updated: August 21, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Roads : వర్షంతో దెబ్బతిన్న రోడ్లు వంతెనలకు శాశ్వత మరమ్మతులకు ప్రతిపాదించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు (State roads and buildings) సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల వివరాలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆరాతీయగా ఇంజనీర్లు వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక పునరుద్దరణకు రూ.46కోట్లు, శాశ్వత పునర్దురణకు రూ.984 కోట్లు అవుతుందని మంత్రికి వివరించారు .బుధవారం నాడు ఆర్ అంబానీ అధికారులతో మంత్రి టెలికా న్ఫరెన్స్ నిర్వహించారు. కాజ్ వే లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలు మంత్రి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు

పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ అండ్ బి హెడ్ ఆఫీస్ లో కంట్రోల్ సెంటర్కు వస్తున్న ఫిర్యాదులు, సమాచార వివరాలపై మంత్రి ఆరా తీయగా స్టేట్ రోడ్స్ సి.ఈ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో షిఫ్టుకు నలుగురు చొప్పున 24గంటలు మానిట రింగ్ చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి గత రివ్యూలో రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు వేగవంతం కల్వర్టులు,బ్రిడ్జిలు,కోతకు గురైన రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడండి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బి డివిజన్ల నుండి వివరాలు సేకరణ చేస్తున్నామని, 24 ఉంటున్నామని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ మంత్రికి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవుపై వెళ్ళొద్దన్న ఆదేశాలు పాటిస్తూ.. ప్రతి ఆర్ అండ్ బి అధికారి నిబద్ధతతో పనిచేశారని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ అండ్ బి పరిధిలో 739 చోట్ల సమస్యాత్మక రోడ్లు గుర్తించామని, అందులో 854 కి.మీ రోడ్డు దెబ్బతిందని, 25 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 5 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశామని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (R&B) మంత్రికి వివరించారు. 310 చోట్లలో కాజ్ వేలు, కల్వర్టులు వరద ప్రవాహం ఉంటే అందులో 228 దారి మళ్లింపు చేసినట్లు పేర్కొన్నారు.

వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు ₹1,000 కోట్ల ప్రణాళిక

రాకపోకలకు ఇబ్బంది ఉన్న 232 ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన 175చోట్ల క్లియర్ చేశామని, మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామని అన్నారు. మొత్తంగా 200 చోట్ల లో రోడ్లు, కాజ్ వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించాలని ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తాత్కాలిక పునరు ద్ధరణకు 46 కోట్లు వరకు ఖర్చు అవుతుం దని, శాశ్వత పునరుద్ధరణ కోసం 984 కోట్లు అవస రమవుతాయని అంచనా వేసినట్లు వివరించారు. రోడ్ల డ్యామేజీ, ప్రజల రాకపోకలకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా, పలు దినపత్రికల్లో వార్తలు చూశానని వాటి క్షేత్ర స్థాయి పరిస్థితి ఏంటని మంత్రి ఆరా తీశారు. వెంటనే ఆ ప్రాంతాల్లో రీస్టోర్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేట్ ఎన్ హెచ్ రోడ్ల కు సంబంధించిన వివరాలు ఇంచార్జి ఈఎన్సి జయభారతి, ఆర్వోబి, ఆర్ యు బి ల వద్ద పరిస్థితిని సి. ఈ రాజేశ్వర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువ చ్చారు. ఇప్పటి వరకు ఆర్ అండ్ బి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలు, క్షేత్ర స్థాయిలో చూపిన పని తీరును అభినందించిన మంత్రి, అదేస్పూర్తితో రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని వారికి చెప్పారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/fertilizers-support-only-for-those-who-bring-2-lakh-tons-of-fertilizers/telangana/533774/

Breaking News in Telugu Heavy Rain Damage infrastructure development Latest News in Telugu Roads and Bridges Repair Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.