📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Road Accident: బస్సు ప్రమాదంలో దివ్యాంగురాలైన యువతి

Author Icon By Saritha
Updated: February 20, 2026 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Road Accident: స్నేహలత అనే 23 ఏళ్ల యువతి హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను పోషిస్తూ చెల్లిని చదివిస్తోంది. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హుటాహుటిన ఆ యువతి హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరగా మార్గమధ్యలో బస్సు బోల్తాపడింది. ఆ ఘటనలో యువతి చేయి తెగిపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు కానీ.. విరిగిపడిన చేయిని మాత్రం ఘటనాస్థలంలోనే వదిలేశారు. ఆమెను చూసిన డాక్టర్లు.. 2 గంటల్లోగా విరిగిన చేయిని తీసుకొస్తే ఆపరేషన్ చేసి అతికిస్తామని చెప్పారు. కానీ ఆ చేయిని తీసుకురావడం ఆలస్యం కావడంతో ఆ యువతి ఇప్పుడు చేయి లేకుండానే బతకాల్సిన పరిస్థితి వచ్చింది.

Read Also: Inter Hall Tickets 2026: హాల్‌టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోండి ఇలా

Road Accident: Young woman disabled in bus accident

దేవరకొండ స్నేహలత అనే 23 ఏళ్ల యువతి స్వస్థలం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్‌ గ్రామం. బీఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. తల్లిదండ్రులు స్నేహలతనే ఆర్థికంగా దిక్కు. చెల్లెలు అక్షితను ఇంటర్‌ చదివిస్తోంది. అమ్మకు ఒంట్లో బాగోలేదని ఫోన్ వచ్చింది. దీంతో అదే రోజు రాత్రి స్నేహలత బస్సులో అనంతపురం బయల్దేరింది.

ఆమె ప్రయాణిస్తున్న బస్సు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు వద్ద గురువారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఆ ఘటనలో యువతి చేయి తెగిపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు కానీ.. విరిగిపడిన చేయిని మాత్రం ఘటనాస్థలంలోనే వదిలేశారు. డాక్టర్లు తెగిపోయిన చేతిని తీసుకొస్తే శస్త్రచికిత్స చేస్తామని చెప్పడంతో ఆమె బంధువు ఘటనాస్థలికి వెళ్లి చేతిని తీసుకొచ్చాడు. అయితే అప్పటికే ఆలస్యమై, చేతిలోని కణాలు నిర్వీర్యం కావడంతో దాన్ని అతికించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు ప్రమాదం జరిగిన తర్వాత తమ కుమార్తెతోపాటే ఆమె చేయిని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించి ఉంటే.. ఆమెకు చెయ్యి వచ్చేదని, చిన్న పొరపాటుతో తమ కుమార్తె ఇప్పుడు శాశ్వతంగా దివ్యాంగురాలిగా మారిందని స్నేహలత తల్లిదండ్రులు వాపోతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anantapur Girl Hand Amputation Jogulamba Gadwal Road Accident Latest News in Telugu Road Accident Snehalata Bus Accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.