📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Road Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

Author Icon By Sharanya
Updated: August 10, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరీంనగర్ జిల్లాలో పండుగ సందర్భంగా కుటుంబాలు ఆనందంలో మునిగిపోతున్న వేళ, ఒక కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే వివాహం అయిన ఓ యువతి, పరీక్షల కోసం భర్తతో కలిసి బయలుదేరిన ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయింది.

Road Accident

పరీక్షకు వెళ్లిన నవ వధువు.. తిరిగిరాలేదు

చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌కు చెందిన ముద్దసాని అఖిల, ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లింది. పరీక్షను తిమ్మాపూర్ (Thimmapur) మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కాలేజీ పరిధిలోని డిజిటల్ జోన్‌లో రాసిన అనంతరం భర్తతో కలిసి బైక్‌పై తిరుగు ప్రయాణంలో పాల్గొంది.

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

అఖిల దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. వీరిద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అఖిలను ఢీకొట్టి తలపై నుంచి వెళ్లిపోయింది. తీవ్ర గాయాల వల్ల ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త పరిస్థితిపై సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

పెళ్లి జరిగిన మూడు రోజులకే విషాదం

ఇటీవలనే అఖిల వివాహం (Akhila got married recently) జగిత్యాల జిల్లా లొత్తునూర్ గ్రామానికి చెందిన యువకుడితో ఘనంగా జరిగింది. వివాహ ఆనందం ఇంకా ఇంట్లో ఉండగానే, ఆమె మరణవార్త రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. తాళిబొట్లు మిన్నబడకముందే, పారాణి ఆరాకముందే అఖిల మృత్యువాత పడటం కుటుంబ సభ్యుల హృదయాలను పలుకరించింది.

తల్లిదండ్రుల బాధ కన్నీటిగా మారింది

పరీక్ష రాసి తిరిగొస్తున్న కూతురిని వేచి చూస్తున్న తల్లిదండ్రులకు, ఆమె మరణవార్త మరచిపోలేని దెబ్బయింది. నల్లపూసలు కుట్టించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కూతురు ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుని కుంటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆనందంగా వెళ్లిన కూతురు విగతజీవిగా తిరిగొచ్చిన దృశ్యం చూస్తూ తల్లిదండ్రులు, బంధువులు విలపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-rains-yellow-alert-issued-for-13-districts-today/telangana/528375/

bike accident Breaking News Bride Dies in Accident Karimnagar news latest news Newlywed Death Road Accident Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.