తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో పదుల కొద్దీ మృత్యువాత పడడం తీవ్ర విషాదం నింపింది. ఈ తరుణంలోనే ఇప్పుడు తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కాగజ్‌నగర్‌కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్‌లో బయలుదేరరారు. (Road Accident) జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read Also: HYD Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
మరోవైపు హైదరాబాద్ నగరంలో మౌలాలి లోని స్నేహితుడి ఇంటి వద్ద జరిగిన ఫంక్షన్ కి నిఖిల్ (22) కారులో వెళ్లి వస్తూ పోచారం సద్భావన టౌన్షిప్ లో ఉంటున్న స్నేహితులను దింపేందుకు వెళ్తుండగా మేడిపల్లి లోని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 97 వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. దీంతో పిల్లర్ ను కారు బలంగా ఢీకొట్టింది. (Road Accident) ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి వరుణ్, నిఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వేగంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘటనలో వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే మరో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: