📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Revenue Digital app: ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ కొత్త యాప్

Author Icon By Sharanya
Updated: August 18, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణ కోసం రెవెన్యూ శాఖ సరికొత్త డిజిటల్ యాప్ను అభివృద్ధి చేస్తోంది. బైజాక్యుటీ సొల్యూషన్స్ రూపొందిస్తున్న ఈ యాప్ (Revenue Digital app) ద్వారా ప్రభుత్వ భూముల వివరాలను డిజిటల్గా నమోదు చేసి, జియోట్యాగ్ (jiotag) చేయనున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్, భూముల నిర్వహణలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి రెవెన్యూ శాఖ ఒక సరికొత్త డిజిటల్ యాప్ను రూపొందిస్తోంది.

Revenue Digital app

డిజిటల్ మ్యాప్లో భూముల కొలత

బైజాక్యుటీ సొల్యూషన్స్ అనే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్ (Revenue Digital app) ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ భూముల వివరాలను డిజిటల్గా నమోదు చేసి పారదర్శకంగా వాటిని పర్యవేక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఈ యాప్లో ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూములు, అలాగే కోర్టు కేసులలో ఉన్న భూముల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ రెడ్ మార్క్ ఏర్పాటు చేసి, వాటిని జియోట్యాగ్ చేయనున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో, డిజిటల్ మ్యాప్లో (digital map) భూముల కొలతల్లో ఏ మాత్రం తేడా ఉండదు. ఈ యాప్ లోని జియోట్యాగ్ చేసిన చిత్రాలు, వివరాలు భూ కబ్జా ప్రయత్నాలను గుర్తించడంలో సహాయపడతాయి. అవసరమైతే, ఈ చిత్రాలను కోర్టులో చట్టపరమైన సాక్షాలుగా ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఈ యాప్ తో ఒకే క్లిక్తో మొత్తం జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

దీనివల్ల అధికారులకు, ప్రజలకు సమయం అవుతుంది. ప్రస్తుతం ఆదా విధానాన్ని ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ జిల్లా యాప్లో మరిన్ని అదనపు ఫీచర్లను చేర్చనున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను సందర్శించి, కబ్జాకు గురయ్యాయా లేదా కోర్టు కేసులు ఉన్నాయా వంటి వివరాలను కూడా ప్రత్యేకంగా యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈ యాప్ రానున్న ఒకటి, రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వ భూముల నిర్వహణలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tummala-nageswara-rao-urea-fertilizer-warning/telangana/531765/

Breaking News Digital Governance Government Land Protection Land Records latest news Revenue Digital App Telangana Revenue Department Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.