Revanth Reddy: కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఉండాలి

Read Time:  1 min
Revanth Reddy: కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఉండాలి
FONT SIZE
GET APP

Revanth Reddy: ఢిల్లీ (Delhi) ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచం దూసుకెళ్తోందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. అందులో ఏఐ రాకతో మరింత వేగం పెరిగిందని తెలిపారు. అదే సమయంలో ఈ ఏఐ టెక్నాలజీలో భారత్ కూడా పరుగులు పెట్టాలంటే దాని కోసం కేంద్ర ప్రభుత్వంలో స్పెషల్‌గా ఒక మంత్రిత్వ శాఖను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి హితవు పలికారు.

Read Also: CM Revanth at AI Summit: ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్

Revanth Reddy: కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఉండాలి
Revanth Reddy: There should be an AI Ministry at the Center

ఏఐ వినియోగం, కంట్రోల్, మార్గదర్శకాలు, నేషనల్ సెక్యూరిటీ వంటి అంశాలను ఈ మంత్రిత్వ శాఖ అత్యవసరం అని పేర్కొన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజాలన్నీ ఈ ఏఐ సదస్సుకు వచ్చాయని మనం చేసే ఆలోచనలే జీవితాలు మార్చేస్తాయని తెలిపారు. మనుషుల కంటే ఏఐకి మరిన్ని ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏఐ కేవలం ఇంకో టెక్నాలజీ మాత్రమే కాదని మానవ పరిణామ క్రమంలో చాలా కీలక మలుపు అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న మెషీన్లు, టెక్నాలజీల లాగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని సమాచారాన్ని విశ్లేషించగలదని దానికి అనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుందని వెల్లడించారు.

భారత్‌కు నేషనల్ ఏఐ రోడ్‌మ్యాప్

భారత్‌కు నేషనల్ ఏఐ రోడ్‌మ్యాప్ చాలా అత్యవసరమని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏఐ డెవలప్‌మెట్‌కు సంబంధించి ప్రతీ దశలో సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫామ్‌లు, అప్లికేషన్లు వంటి స్పష్టమైన వ్యూహాలతో భారత్ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రపంచంలో ఏఐ తెస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.