Revanth reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) విసిరిన సవాల్‌పై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని, ఆపై ఇతర విషయాలపై చర్చించాలన్న డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తమ ఎన్నికల హామీ కాదని స్పష్టం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని రేవంత్‌కు హితవు పలికారు.
Read also: Crime: ఫోన్ ట్యాప్ కేసులో టివీ5 మూర్తిపై కేసు

Revanth reddy: రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
రేవంత్ సవాల్ విసరగా
Revanth reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు, వాగ్దానాలపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేసీఆర్, హరీశ్ రావుల అరెస్టులపై రేవంత్ సవాల్ విసరగా, కిషన్ రెడ్డి ఇచ్చిన ఈ ప్రతిస్పందనతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: