📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Revanth Reddy: హార్వర్డ్ వర్సిటీలో మాట్లాడనున్న సిఎం

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : అమెరికాలోని (America) ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరయ్యారు. తొలి రోజు పరిచయ కార్యక్రమాలతో పాటు 21వ శతాబ్దంలో నాయకత్వం.. కోర్సులో భాగంగా ‘అధికార విశ్లేషణ-నాయకత్వం’ అంశంపై తొలిసెషన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇందులో కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) తరగతులు కొనసాగనున్నాయి. మరోవైపు బోస్టన్ ప్రాంతమంతా తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ మంచు తుఫాను (ఫెర్న్) కారణంగా రెండు అడుగులకు పైగా (సుమారు 24 ఇంచులు) మంచు కురిసినట్లు సమాచారం.

Read also: Telangana: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స

The CM will be speaking at Harvard University.

ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పూర్తిగా అధికారికమేనని స్పష్టీకరణ

ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అధికారికమేనని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టీకరణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక విదేశీ పర్యటనలో ఎలాంటి సమాచారం లేకుండా వ్యక్తిగత పర్యటనపై వెళ్లారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. (Revanth Reddy) తెలంగాణ సిఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం అంటూ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రచారమే అని తెలిపింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా సిఎం అధికారికంగా ఆమోదించిన పర్యటనకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను తప్పుదారి పట్టించి గందరగోళం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం ఇది అని పేర్కొంది. ముఖ్యమంత్రి న్యూయార్క్ పర్యటన పూర్తిగా అధికారికమేనని, అన్ని విధివిధానాలకు అనుగుణంగా సమన్వయంతో నిర్వహించారని పేర్కొంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను ముందుగానే అధికారికంగా తెలియజేసి, నిబంధనల ప్రకారమే నిర్వహించారని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాలపై హెచ్చరిక

విదేశీ పర్యటనకు అవసరమైన అన్ని అనుమతులను ముందుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి పొందినట్లు వెల్లడించింది. దావోస్ నుంచి అమెరికా చేరుకున్న అనంతరం, న్యూయార్క్ విమానాశ్రయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారని తెలిపింది. న్యూయార్క్ ముఖ్యమంత్రి ప్రయాణానికి ఎంఈఏ అధికారిక వాహనాన్ని ఏర్పాటు చేసిందని, ఇది సాధారణ దౌత్య విధానాల్లో భాగమేనని తెలిపింది. శీతాకాలంలో తీవ్ర మంచు తుపానుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో విమాన ప్రయాణం చేయవద్దని ఎంఇఎ సిఎంని ఆదేశించిందని, వారి తదుపరి ప్రయాణాన్ని రోడ్డు మార్గంలో చేపట్టాలని తెలిపిందని గుర్తు చేసింది.

ఎంఈఏ సూచనల మేరకు, బోస్టన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణాన్ని ఎంఈఏనే ఏర్పాటు చేసిందని, ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ వరకు ముఖ్యమంత్రి ప్రయాణం కూడా ఉందని తెలిపింది. ఉన్నతస్థాయి విద్యా సంస్థ నిర్దేశించిన కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉండటంతో, ఈ కాలంలో ఉద్దేశ్య పూర్వకంగానే ముఖ్యమంత్రి తన కార్యక్రమాలను నిరాడంబరంగా ఉంచినట్లు ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి, బాధ్యతారహితమైనవి, అలాగే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రమేనని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Executive Education Harvard University Kennedy School Latest News in Telugu Leadership Program Revanth Reddy telangana cm Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.