తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరారు. నిన్న రాత్రి 2.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన ల్యాండ్ అయ్యారు. ఆయనను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితర పలువురు రాజకీయ నాయకులు ఘనంగా పూలమాలలు అర్పించి, శాలువాలతో స్వాగతించారు.
Read Also: Kamareddy Crime: చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రేవంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి నుంచి (Revanth Reddy) అమెరికాకు (USA) వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఆయన లీడర్ షిప్ కోర్సు పూర్తి చేశారు. జనవరి 25 నుంచి 30 వరకు జరిగిన లీడర్ షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి ఆయన ఈ కోర్సును పూర్తి చేశారు. అమెరికాలో కోర్సును పూర్తి చేసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: