📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

Author Icon By Tejaswini Y
Updated: January 9, 2026 • 7:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ -సిటీ(Raviryala E-City)లో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగినది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ 1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోందన్నారు.

Read also: Siddipet: సిపి గా బాధ్యతలు స్వీకరించిన సాధన రష్మి పెరుమాళ్

జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భావనగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషం, గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశామని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి ఉంటుందని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

Revanth Reddy: Suzen Medicare Fluids Unit Launched in Raviryala E-City

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ క్యూర్, ప్యూర్ పై ఆధారపడి ఉంటుందని, ప్రపంచంలోని గొప్ప నగరాలతో హైదరాబాద్, తెలంగాణ పోటీ పడుతోందని, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో తెలంగాణ పోటీ పడుతోంది అందులో భాగంగా యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నామని, మన దగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. ఇది మనకు ఎంతో గర్వకారణం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటా, వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటా నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు అడ్డంకులు పెట్టకండి అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు, రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోంది మేం వివాదం కోరుకోవడంలేదు, పరిష్కారం కోరుకుంటున్నాం రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని అన్నారు.

తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయి పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడం లేదు అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నాం రాబోయే పదేళ్లల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ టి.నిర్మల జగ్గారెడ్డి , చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు పట్నం సునీత మహేందర్ రెడ్డి, తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టిజిఐఐసి వైస్ ఎండి శశాంక (ఐఏఎస్), డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షహనావాజ్ ఖాసీం, టీయూఎఫ్ఐడిసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Industrial Development Maheshwaram Medical Fluids Unit Rangareddy District Raviryala E-City Revanth Reddy Sujan Medicare telangana cm

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.