📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Revanth Reddy: వీధిదీపాలు సర్పంచ్లకే నిర్వహణ బాధ్యత వారికే అప్పగింత: సిఎం రేవంత్

Author Icon By Sharanya
Updated: September 16, 2025 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రమంతటా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్ప గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎస్ఈడీ లైట్లను (LED lights)అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవస రమున్నాయో పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

News telugu

ఎంపీడీవో పర్యవేక్షణలో గ్రామాల ఎస్ఈడీ డ్యాష్ బోర్డు

రాత్రి పూట ఎల్ ఈడీ లైట్లు పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎస్ఈడీ డ్యాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎస్ఈడీ లైట్లున్నాయని, వరంగల్(Warangal), నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎస్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పం చులకే వీటిని అప్పగిస్తే.. లైట్ల నిర్వహణ, విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ఎస్ఈడీ లైట్లను హైద రాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5.50 లక్షల ఎల్డీ లైట్లు ఉన్నాయని, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ సీఎంకు నివేదించింది. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియటంతో ఇప్పుడు చాలాచోట్ల లైట్లు వెలగటం లేదని, నిర్వహణ కూడా సరిగా జరగలేదని అధికారులు నివేదించారు. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎస్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు.

ఎస్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్ ల ఏర్పాటు

కొత్తగా ఎస్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్ డీ ಇಲ್ಲ తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వనించాలని, ఏడేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని, నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ఎస్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్ ల ఏర్పాటు, నిరంతరం అవి పనిచేస్తున్నాయా లేదా, ఏయే ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలన్నారు. హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ.8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుందని, విద్యుత్తు ఆదా చేసేందుకు సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు అవుటర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఎస్ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కోర్ అర్బన్ సిటీతో పాటు మున్సిపాలిటీల్లో ఎస్ఈడీ లైట్లకు కూడా టెండర్లు పిలవాలన్నారు.
సిఎం వద్ద జరిగిన సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీ హెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీజన ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేశారు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామాలలోని వీధిదీపాల నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామస్థాయిలో స్వయంప్రతిపత్తిని పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం ఈ నిర్ణయం గురించి ఎప్పుడు ప్రకటించింది?

ఈ ప్రకటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రభుత్వ సమావేశంలో లేదా అధికారిక కార్యక్రమంలో వెల్లడించారు. పూర్తి అమలు తేదీ, మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/itr-filing-deadline-extended-september-16-last-chance/business/548130/

Breaking News gram panchayat news latest news Revanth Reddy sarpanch powers street lights maintenance telangana government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.