నూరుశాతం సబ్సిడీతో రుణాలు
హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో ట్రాన్స్ జెండర్లు కూడా గౌరవప్రదమైన జీవనం సాగించేలా, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడేలా భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్ జెండర్లకు 100 శాతం సబ్సిడీ(100 Percent Subsidy Loan)తో రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ. 75 వేల వరకు రుణం మంజూరు చేయనున్నారు.
Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్
ఇది పూర్తిగా సబ్సిడీతో కూడుకున్నది కావడంతో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా రంగంలో నైపుణ్య శిక్షణ పొంది, సొంతంగా చిరువ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సాయం అందిస్తారు. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న ట్రాన్స్ జెండర్లు(Transgender) ఈ పథకానికి అర్హులని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పథకం కింద 30 స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తి గల అభ్యర్థులు నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లో ఉన్న కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. లేదా వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వచ్చే నెల (జనవరి) 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: