📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Revanth Reddy : కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష

Author Icon By Divya Vani M
Updated: April 5, 2025 • 9:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని కంచ భూముల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.భూముల్లో చెట్లు నరికి వేయడంపై,వన్యప్రాణులు ప్రాణభయంతో పారిపోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వన్యప్రాణులు అల్లకల్లోలం అవుతున్నట్టు చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించాయి.ఈ వ్యవహారాన్ని సీఎం ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు.ఇలాంటి ఫేక్ కంటెంట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వాస్తవాలు ప్రజల ముందుకు రావాలంటే విచారణ అనివార్యమని సీఎం అభిప్రాయపడ్డారు.అందుకోసమే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.

Revanth Reddy కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష

ఈ వీడియోలు ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డాయన్న అనుమానంపై విచారణ జరిపించాలని ఆదేశించారు.గచ్చిబౌలి ప్రాంతంలో గత 25 ఏళ్లలో ఎన్నో నిర్మాణాలు జరిగినప్పటికీ.ఎప్పుడూ వన్యప్రాణులపై ఇలాంటి ఆరోపణలు రాలేదని అధికారులు గుర్తు చేశారు.ఇప్పుడొచ్చిన వీడియోలు అసత్య సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సృష్టించబడ్డవని తెలిపారు.ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదన్న దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.ఫేక్ ఏఐ వీడియోలను గుర్తించే స్పెషలైజ్డ్ టూల్స్ – ఫోరెన్సిక్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిజ్ఞానం అందుబాటులో ఉండాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అటవీశాఖ అధికారులు, టీజీఐఐసీ ఎండీ పాల్గొన్నారు.

READ ALSO : Chennai Super Kings : చెన్నైకి మరో షాక్ – ఢిల్లీ చేతిలో పరాజయం

CM Revanth Reddy News Gachibowli land issue Telangana Cyber Crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.