📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

RBI Governor meeting : సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

Author Icon By Sai Kiran
Updated: December 19, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RBI Governor meeting : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, సంస్కరణలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గవర్నర్, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలక సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన, సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రస్తావించారు. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయని ఆయన వివరించారు.

Latest news: Mumbai Rent Crisis: ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ఈ సందర్భంగా, అనియంత్రిత డిపాజిట్ స్కీమ్స్‌ను అడ్డుకునే బడ్స్ చట్టాన్ని (BUDS Act) రాష్ట్రంలో త్వరగా నోటిఫై చేయాలని (RBI Governor meeting) ఆర్బీఐ గవర్నర్ ముఖ్యమంత్రిని కోరారు. అలాగే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI), ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల వద్ద క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి గవర్నర్ వివరించారు. తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతున్నందున, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్న నేపథ్యంలో వడ్డీ రేట్లు కొంతకాలం పాటు తక్కువ స్థాయిలో కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదిరితే దేశ ఆర్థిక వృద్ధి రేటు ఆర్బీఐ అంచనాలను మించవచ్చని, ముఖ్యంగా అమెరికాతో ఒప్పందం వల్ల వృద్ధి రేటు సగం శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Breaking News in Telugu BUDS Act notification Google News in Telugu India economic growth Latest News in Telugu RBI Governor meeting RBI governor Sanjay Malhotra RBI interest rate outlook Revanth Reddy Telangana economic policies Telangana economy Telangana power sector reforms Telugu News Unclaimed deposits RBI Unified Lending Interface ULI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.