తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో ముస్తాబుచేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం (Vana Mahotsavam) – 2025 కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రకృతి పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సారి మరింత విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేసింది.
వన మహోత్సవం ప్రారంభించిన సీఎం రేవంత్
ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా ప్రారంభించడమే కాకుండా, మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ ప్రభుత్వ ఆత్మీయతను చాటారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Agricultural University) జరిగిన ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది.
18.03 కోట్ల మొక్కల లక్ష్యం
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటే అంబిషస్ టార్గెట్‌ను ప్రభుత్వం పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, పారిశ్రామిక జోన్‌లు, రహదారుల పక్కన, స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కల నాటన జరగనుంది. పర్యావరణం రక్షణతో పాటు, భూగర్భ జలాల పరిరక్షణ, హరితవాతావరణం నిర్మాణానికి ఇది బీజంగా మారనుంది.
సీఎం రేవంత్ సందేశం
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ స్వయంగా మొక్కను నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి కొండా సురేఖ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బొటానికల్ గార్డెన్స్ సందర్శన
వన మహోత్సవం కార్యక్రమం అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించి, అక్కడ ఒక రుద్రాక్ష మొక్కను నాటారు. కార్యక్రమం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Revanth Reddy: నేడు ఢిల్లీ కి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి