📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telugu News: Revanth Reddy: 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Author Icon By Sushmitha
Updated: December 11, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించింది. (Revanth Reddy) తాజాగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో (Telangana Rising Global Summit) భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగులకు కూడా శుభవార్త చెప్పింది.

Read Also: HYD: తెలంగాణ రైజింగ్ 2047

Revanth Reddy Job and employment opportunities for 13 lakh people

భారత్ ఫ్యూచర్ సిటీ: లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ

3 ట్రిలియన్ డాలర్ల తెలంగాణ ఎకానమీని సాధించే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు. ఈ నగరం 13,500 ఎకరాలలో అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో, అద్భుతమైన మౌలిక సదుపాయాలతో, జీరో కార్బన్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు.

ఈ ఫ్యూచర్ సిటీ ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అవి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, డేటా సెంటర్‌లు, అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రత్యేకంగా నెలకొల్పనున్నట్టు వివరించారు.

13 లక్షల ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీ భరోసా

ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. దాదాపు తొమ్మిది లక్షల మంది జనాభా కోసం నివాస గృహ సముదాయాలను కూడా నిర్మిస్తామని, వీటిని నిర్మాణ రంగ నిపుణులు అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ నిర్మాణాలు ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు.

ఈ వార్త ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురుగా మారింది. మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయని ఇటీవల ప్రకటించడం కూడా యువతకు సంతోషాన్ని కలిగించింది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana/delhi-revanth-reddy-met-with-senior-congress-leaders/603563/

13 3 Trillion Dollar Economy 500 Acres Development 6 Urban Districts Artificial intelligence Bharat Future City Google News in Telugu Latest News in Telugu Minister Sridhar Babu Telangana Rising Global Summit Telugu News Today Zero Carbon City

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.