Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆయనపై ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న పరువు నష్టం కేసును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. ఈ తీర్పుతో సీఎం రేవంత్‌కు తాత్కాలికంగా ఓ న్యాయ విజయం లభించినట్టైంది.
వివాదాస్పద ప్రసంగం.. కోర్టులో కేసు
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచార సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే వివాదానికి కేంద్రంగా మారాయి. ఆ సభలో, “బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను రద్దు చేస్తుంది,” అని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పరువు నష్టం దావా.. ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ
రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ప్రసంగంపై బీజేపీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణను కొనసాగిస్తోంది. కేసు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో కొంతమంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు.
హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి
ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ కొనసాగుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు రాజకీయ స్వార్థాలతో దాఖలు చేయబడినదేనని పేర్కొంటూ విచారణను నిలిపివేయాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, ఆయన వాదనలకు అనుకూలంగా స్పందించి, కేసును కొట్టివేయనున్నట్లు తీర్పు వెలువరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: