📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Harish Rao : రేవంత్‌రెడ్డికి నీటి పై బాధ్యతలేదు : హరీష్‌రావు ఫైర్

Author Icon By Divya Vani M
Updated: June 19, 2025 • 7:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణకు ద్రోహంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి Revanth Reddy పై హరీష్‌రావు Harish Rao ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా నీళ్లను ఏపీకి ఇవ్వడం తగదని మండిపడ్డారు. ఉద్యమ స్ఫూర్తి లేకపోతే నీటి విలువ తెలియదన్నారు.నల్లమల ఏ జిల్లాలో ఉందో కూడా తెలియని సీఎం ఎలా పాలిస్తారని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్‌లో ఉందో తెలియదంటే ఎలా నమ్మాలో అన్నారు. స్కూల్ పిల్లాడికి తెలిసిన విషయాలు సీఎం చెప్పలేకపోతున్నారని విమర్శించారు.బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తీరు ఎక్కడికి తీసుకెళుతుందంటూ ప్రశ్నించారు. అఖిలపక్ష ఎంపీల సమావేశం పెట్టిన ఉద్దేశమేంటని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలా? లేక మద్దతివ్వాలా అని సూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్ మాటలను రేవంత్ వక్రీకరించారు

రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా నీటి ప్రణాళికలు కావాలని కేసీఆర్ అన్న మాటల్ని రేవంత్ వక్రీకరించారని ఆరోపించారు. నదీ మార్గం నుంచే నీళ్లు తేవాలని మాత్రమే కేసీఆర్ జగన్‌తో అన్నారని గుర్తుచేశారు.19 నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తికాలేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్‌ను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ వైఫల్యానికి రేవంత్, ఉత్తమ్‌లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రైతుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్లే సన్నాహం

తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే రైతుల తరపున సుప్రీంకోర్టుకెళ్తామని హెచ్చరించారు. సరైన విధానంతో పోరాడితే సహకరిస్తామని స్పష్టంగా తెలిపారు. రేవంత్‌ రెడ్డి నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

Read Also : Ganta Srinivasa Rao : ధైర్యం ఉంటే రా.. తేల్చుకుందాం : జగన్‌కు గంటా శ్రీనివాసరావు సవాల్

Banakacharla Project Godavari Krishna river waters Harish Rao criticism KCR water resources Revanth failures Revanth Reddy water dispute SLBC failure Telangana Congress criticism Telangana water rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.