📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి  హరీశ్ రావు హెచ్చరిక

Author Icon By Rajitha
Updated: October 5, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పీజీ మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కేటాయింపులో తెలంగాణ Telangana విద్యార్థులపై తీవ్రమైన అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ. హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి Revanth Reddy బహిరంగ లేఖ రాస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హరీశ్ రావు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సగం రాష్ట్ర కోటా కింద భర్తీ అవుతాయి. ఆ రాష్ట్ర కోటాలో సుమారు 450 సీట్లు మేనేజ్‌మెంట్ కోటాకు కేటాయించబడ్డాయి. అయితే, ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ లేకపోవడం వల్ల అవన్నీ ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Telangana: బీజేపీలో మళ్లీ వర్గ విభేదాలు: నాయకత్వంపై నేతల ఆగ్రహం

Revanth Reddy

ఆంధ్రప్రదేశ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానిక రిజర్వేషన్ అమలులో ఉందని గుర్తుచేశారు. అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తే సుమారు 382 సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తాయని, కేవలం 68 సీట్లు మాత్రమే ఇతర రాష్ట్రాల వారికి దక్కుతాయని ఆయన లేఖలో వివరించారు. “ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల మన విద్యార్థులు విలువైన అవకాశాలను కోల్పోతున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ BRS ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి, కొత్త మెడికల్ కళాశాలలు స్థాపించి, 2014 తర్వాత ఏర్పడిన కాలేజీల్లో 100% ఎంబీబీఎస్ సీట్లు స్థానికులకు కేటాయించిందని హరీశ్ రావు గుర్తు చేశారు. దాంతో ప్రతి సంవత్సరం సుమారు 1,800 పైగా సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభించాయని వివరించారు.

85 శాతం

కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. “ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి, మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే విడుదల చేసిన పీజీ అడ్మిషన్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త జీవో జారీ చేయాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

హరీశ్ రావు సీఎం రేవంత్‌కు ఎందుకు లేఖ రాశారు?
పీజీ మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారని తెలియజేయడానికి.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయి?
రాష్ట్రవ్యాప్తంగా 1,801 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News brs harish rao latest news Local Reservation Management Quota Revanth Reddy Telangana PG Medical Seats Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.