తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి హైకోర్టు కీలకమైన ఊరటను కలిగించింది. 2019లో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును హైకోర్టు కొట్టివేసింది. దీనితో ఆయనపై ఉన్న కేసు నుంచి విముక్తి లభించింది.
ఏంటి ఈ కేసు నేపథ్యం?
2019 అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో, సూర్యాపేట (Suryapet) జిల్లా గరిడేపల్లి మండలంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై పోలీసు అధికారులు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ఒక క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎన్నికల చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.
క్వాష్ పిటిషన్ దాఖలు – విచారణ వివరాలు
ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొనాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి హైకోర్టు (High Court) లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో, ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. రేవంత్ తరఫున అభ్యర్థించారు ఈ కేసు రాజకీయ ప్రేరణతో నమోదు చేయబడిందని, నిజంగా ఎటువంటి ఉల్లంఘన జరగలేదని న్యాయవాదులు వాదించారు.
హైకోర్టు తీర్పు: కేసుకు ముగింపు
వివరాలు పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం, కేసు నమోదులో సరైన ఆధారాలు లేవని భావిస్తూ, కేసును కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: