📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Revanth Reddy: నేడు ఢిల్లీ కి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By Sharanya
Updated: July 7, 2025 • 10:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో కీలక చర్చలు జరపనున్నారు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన అనంతరం రేవంత్ ఢిల్లీ (Delhi) కి వెళ్లడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

కేంద్రంతో కీలక చర్చలు

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రధాన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమై ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. (discuss with Union Ministers) ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ (Revanth Reddy) కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉండటంతో కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తారు.

రేషన్ కార్డుల పంపిణీ – రాహుల్, ప్రియాంక ఆహ్వానం

రాష్ట్రంలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారని సమాచారం.

మహిళా శక్తి సంబరాలు – రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు

ఈ నెల 12 నుంచి 18వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని కూడా పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తారు సీఎం రేవంత్.

Read hindi news: hindi.vaartha.com

Read also: KU Graduation Ceremony : నేడు కేయూ స్నాతకోత్సవం.. గవర్నర్ రాక

#CongressHighCommand #CongressParty #DelhiVisit #MetroPhase2 #RegionalRingRoad #RevanthInDelhi #RevanthReddy #TelanganaCM #TelanganaPolitics Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.