📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం

Author Icon By Sharanya
Updated: April 12, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయంగా మారబోతున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారి అందరికీ స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. పర్యాటకానికి, వనరుల పరిరక్షణకు, నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాజెక్ట్ ఎలా మార్గదర్శకంగా నిలవాలో ఆయన వివరించారు.

మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్

బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మాణం ప్రాజెక్ట్‌లో భాగంగా పునరుద్ధరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ ప్రదేశం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటంతోపాటు, శాంతి, స్వచ్ఛతకు ప్రతీకగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే నగరానికి మరింత గౌరవం తెచ్చే అవకాశముంది.

మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జి

మీర్ ఆలం ట్యాంక్‌పైన బ్రిడ్జి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతగా పరిగణించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జూన్‌లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియకు ముందుగా అవసరమైన సర్వేలు, నివేదికలు, డిజైన్లు సిద్ధం చేసి డీపీఆర్ సమర్పించాలని సూచించారు. ఈ బ్రిడ్జి రెండున్నర కిలోమీటర్ల పొడవు కలిగి ఉండనుంది. సందర్శకుల భద్రతకు గరిష్ట ప్రాధాన్యత ఇస్తూ, ఆసక్తికరమైన ఆకృతి, లైటింగ్‌తో ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని సీఎం సూచించారు. మీర్ ఆలం ట్యాంక్‌లో మూడు ఐలాండ్లు ఉన్నాయని, వీటిని ‘గార్డెన్స్ బై ది బే’ ను తలపించేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఐలాండ్లపై బర్డ్స్ పారడైజ్, వాటర్‌ఫాల్స్, అడ్వెంచర్ పార్క్, అంఫీ థియేటర్, థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా, వెడ్డింగ్ డెస్టినేషన్‌గా కూడా మారేలా కన్వెన్షన్ సెంటర్లు, ప్రత్యేకంగా పర్యాటకుల కోసం రిసార్ట్స్, హోటల్స్, బోటింగ్ వంటి ఆకర్షణలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని చెప్పారు.

మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు రూపొందించాలి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించి ఆ మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని సీఎం సూచించారు. మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలి. ఇక్కడి అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలి. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అభివృద్ధి ప్రతిపాదనలన్నీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉండాలి అని ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి, శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read also: Revanth Reddy: పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

#BirdsParadise #HyderabadDevelopment #MeerAlamTank #MusiRevival #RevanthReddy #telengana #TourismHub Breaking News Today In Telugu Google News in Telug India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.