Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్ అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లగా, అక్కడ పలు అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిశారు.
Read Also: KTR news : హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్…
ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అందజేశారు. అలాగే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని ఎఫ్ఆర్‌బీఎం నిబంధనల నుంచి మినహాయించాలని ఆయన కోరారు.
అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైన సీఎం, విద్యా రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: