TG Polytechnic Colleges: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందనే వార్తలు పచ్చి అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. శాసనసభలో విద్యారంగ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ.. పాలిటెక్నిక్ కళాశాలలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, ఈ విషయంలో విద్యార్థులు ఎవరి చేతిలోనూ పావులుగా మారవద్దని హితవు చెప్పారు. జీఓ ఎంఎస్ నెం.97పై నెలకొన్న అపోహలను తొలగిస్తూ, సాంకేతిక విద్యా వ్యవస్థను కేవలం స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేశారు.
Read Also: Hyderabad : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ !!

TG Polytechnic Colleges: టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రూ. 4 వేల కోట్లతో ఆధునీకరణ
విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ కళాశాలలను రూ. 4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ఆధునిక రంగాలకు అనుగుణంగా కోర్సులను తీర్చిదిద్ది, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు మరియు అప్రెంటిస్‌షిప్ సౌకర్యాలు పెంచుతామన్నారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATC) మారుస్తున్నామని, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ కూడా అందించనున్నట్లు తెలిపారు.
భూముల విక్రయంపై అపోహలకు చెక్
పాలిటెక్నిక్ భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏటీసీల ఏర్పాటు కోసం ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ చేసిందని, ఒక్కో కేంద్రంపై దాదాపు రూ. 46 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఈ మార్పులు తెచ్చినట్లు అసెంబ్లీ వేదికగా పునరుద్ఘాటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: