తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీసీ హక్కుల సాధన కోసం తమ ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసిందని తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగం (Education and jobs for BCs), రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించామని తెలిపారు. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి జరిగిందని, ఇది రాహుల్ గాంధీ ఆశయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కులగణనతో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ డేటా ఆధారంగా బీసీలకు న్యాయం చేసేందుకు బిల్లులను తీసుకురాగలిగామని చెప్పారు. దేశమంతటా కులగణన జరగాలన్నది రాహుల్ గాంధీ భావన అని, భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో ఈ డిమాండ్ స్పష్టంగా ఉంచారని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో ప్రసంగిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఇప్పటికీ రాష్ట్రపతి అప్రమేయానికి ఎదురుచూస్తున్నాయని తెలిపారు. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని.. అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా నిరాకరించడంలో కేంద్రప్రభుత్వ ఒత్తిడి ఉండొచ్చన్న అనుమానం తమకు ఉందని వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం నిరంతర పోరాటం
అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారనేది తమ అనుమానమని అన్నారు. రాష్ట్రపతి ఆమోదం లభించేవరకు తమ పోరాటం ఆగదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ బీసీలకు మద్దతు ఇవ్వకపోతే, ప్రజలు మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసే దిశగా ముందడుగు వేస్తారని స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: