📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

టన్నెల్‌ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్‌ పై రేవంత్ రెడ్డి ఆరా

Author Icon By Ramya
Updated: February 24, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

SLBC టన్నెల్ ప్రమాదం: బోరింగ్ మెషీన్ పని విధానం

SLBC టన్నెల్‌లోని ఘోర ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడమే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగల పనిగా మారింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో బోరింగ్‌ మెషీన్‌ కూడా దెబ్బతినడంతో టాస్క్ మరింత క్లిష్టమైనది. ఈ టన్నెల్‌లో బోరింగ్ మెషీన్ పనిచేసే విధానాన్ని మరియు ఈ మెషీన్‌ స్వరూపాన్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

బోరింగ్ మెషీన్: ఎలా పని చేస్తుంది?

శ్రీశైలం కొండను తవ్వుతున్న బోరింగ్‌ మెషీన్‌ అటూఇటూగా ఇలాగే ఉంటుంది. SLBC భూగర్భాన్ని తొలిచేస్తూ, టన్నెల్‌ను నిర్మించడంలో బాహుబలి వంటి ఈ బోరింగ్‌ మెషీనే కీలకం. శ్రీశైలం దగ్గర దోమలపెంటలో ఉన్న SLBC టన్నెల్‌ నిర్మాణానికి వాడుతున్న అర్థచంద్రాకారంలో ఉన్న సిమెంట్‌ దిమ్మెలు ఇవే. వీటిని ఉపయోగించి సొరంగాన్ని వృత్తాకారంగా ఇలా పకడ్బందీగా నిర్మిస్తున్నారు. 10 మీటర్ల వ్యాసంతో ఉన్న టన్నెల్‌ నిర్మించాలంటే, ఈ కొండల్లోని శిలలను తవ్వాలి. ఇది మనుషులు చేసే పనికాదు. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వాలి. అయితే ఇవి మార్కెట్లలో లభించేవి కావు. తవ్వాల్సిన టన్నెల్‌ కోసం, అక్కడి భూమి, శిలలు వంటి భౌగోళిక స్వరూపానికి తగ్గట్లుగా టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ను ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది.

సిమెంట్ బ్లాక్స్, టన్నెల్ యొక్క ప్రత్యేకత

బోరింగ్‌ మెషీన్‌ ఇలా భారీ పైప్‌లా ఉంటుంది. ఇది కొండను తొలుస్తుంది. అతి భారీ నిర్మాణంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బోరింగ్‌ మెషీన్‌ ముందున్న బ్లేడ్స్‌- బండరాళ్లు, మట్టిన తొలుచుకుంటూ ముందుకు వెళుతుంది. ప్రస్తుతం SLBC ఇన్‌లెట్‌ పాయింట్‌ నుంచి 14 కిలోమీటర్ల వరకు ఇలాంటి యంత్రమే తవ్వింది. ఈ బోరింగ్‌ మెషీన్‌ కొండను తొలుస్తున్న సమయంలో వచ్చే మట్టిపెళ్లలు, బండరాళ్లను ఇలాంటి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటకు తరలిస్తారు. మట్టిని బయటకు పంపించిన తర్వాత, టన్నెల్‌ని నిర్మించడానికి ప్రత్యేకంగా సిమెంట్ బ్లాక్స్‌ను తయారుచేస్తారు. ఆ సిమెంట్‌ బ్లాక్స్‌ను ఇలా టన్నెల్‌కు కవచంగా ఫిట్‌ చేస్తారు. తద్వారా భూ ఉపరితలం నుంచి వచ్చే ఒత్తిడిని ఈ సిమెంట్‌ బ్లాక్స్‌ తట్టుకునేలా నిర్మాణం సాగుతుంది. అలాగే భూమి పొరల నుంచి లీక్‌ అయ్యే నీటిని ఇవి అరికడతాయి. నీటి ఊట వల్ల ఈ సొరంగం దెబ్బతినకుండా ఈ సిమెంట్‌ బ్లాక్స్‌ రక్షణ కవచంగా నిలుస్తాయి.

SLBC టన్నెల్ లోను రక్షణ ఏర్పాట్లు

టన్నెల్ నిర్మాణం సమయంలో రక్షణ చర్యలు కూడా కీలకమైనవి. ఇందులో ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఫోర్స్‌గా ఆక్సిజన్ పంపించడానికి పైప్స్ ఉండడం, అలాగే గాలి పంపేందుకు ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉండటం అవసరం. ఇంకా, విద్యుత్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి, యంత్రాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పరిస్థితి

SLBC టన్నెల్‌లో జరిగిన ప్రమాదం తరువాత, ఆ ప్రాంతంలో పైకప్పు కూలిపోయి, పైప్ లైన్లు దెబ్బతిన్నాయని సమాచారం అందింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రస్తుతం మరమ్మతులు చేపట్టారు. బోరింగ్ యంత్రంలో పనిచేస్తున్న ఎనిమిది మంది వర్కర్స్ పరిస్థితి ఇంకా తెలియరావాల్సి ఉంది.

#BigMachines #BoringMachine #Engineering #RescueOperation #slbc #SreeShailamTunnel #tunnelaccident #TunnelConstruction Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.