📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Phone Tapping : రాహుల్‌ ఫోన్‌ కూడా రేవంత్‌ రెడ్డి ట్యాపింగ్‌ చేయిస్తున్నారేమో – RS ప్రవీణ్

Author Icon By Sudheer
Updated: July 22, 2025 • 9:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఉల్టా చోర్ కోత్వాల్ కో ఢాంటే” అన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కీలక నేతలు మాత్రమే కాకుండా, మంత్రివర్గ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ రేవంత్‌పై ఆరోపణలు చేశారు. రెండు మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణను ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వారిలో ఒకరిని పిలిపించి క్లాస్ తీసుకున్నారని తెలిపారు.

ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర బీజేపీ మద్దతు

రేవంత్ రెడ్డి ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర బీజేపీ మద్దతు ఉందని ఆర్‌ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. హరీష్ రావుతో జర్నలిస్టు సంభాషణను సీఎం ఎలా తెలుసుకున్నారు అని ప్రశ్నిస్తూ, ఫోన్ ట్యాపింగ్ తప్ప మరో మార్గం లేదని అన్నారు. తనకు జూలై 14న ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చాయని, కానీ జూలై 7న ఓ మీడియా ఆ నోటీసుల గురించి రాసిందని, దీనిపై ప్రశ్నించారు. విచారణ వివరాలు మీడియాలో ముందే ఎలా వస్తున్నాయని నిలదీశారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టులో సీల్డ్ కవర్‌లో ఫోన్ ట్యాపింగ్ జాబితా సమర్పించాలని డిమాండ్ చేశారు.

హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్

టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం దేశ భద్రతకే సంబంధించి ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిణామాలు చట్ట విరుద్ధమని ఆర్‌ఎస్ ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అవసరమైతే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ప్రైవేట్ స్పై ఏజెన్సీలతో ట్యాపింగ్ చేస్తున్నారని, పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడే అవకాశం ఉన్నదన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సీఎం ప్రతీకార రాజకీయాలే కాకుండా తానే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని త్వరలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Read Also : social service : చండీగఢ్ లో ప్రతి రోజు చెత్తను ఏరివేసే రిటైర్డ్ పోలీస్ అధికారి

CM Revanth Reddy phone tapping rahul gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.