📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Revanth Reddy: కేంద్రం మెడలు వంచి దేశవ్యాప్తంగా కులగణన సాధించాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Author Icon By Sharanya
Updated: July 5, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పునరుద్ఘాటించారు. గాంధీభవన్లో టిపిసిసి (TPCC) విన్నతస్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ కులగణన, సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలు అమలు పరుస్తూ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

Revanth Reddy

రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన

విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించాం నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నామని గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ పార్టీ జిల్లా అధ్యక్షులుగా (NSUI Party District President) పనిచేసిన వారికి చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయని ఆయన తెలిపారు. పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దు ప్రజల్లోకి వెళ్ళి నాయకులుగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని ఆయన హితవు చెప్పారు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి ఒక పని ముట్టుగా ఉపయోగపడి రాజకీయాల్లో మీ ఎదుగుదలకు భవిష్యత్ లో ప్రజాసేవచేయడానికి పోటీ చేసే అర్హతను తీసుకొస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి అని ఆయన వివరించారు.

నూతన నాయక త్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి యువత నుంచి కొత్త నాయకత్వం రావాలి అంటే మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి అని రేవంత్ ఆకాంక్షను వ్యక్తం చేవారు గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలి అపుడు మీకు ప్రజల సమస్యలు తెలుస్తాయని అంతే కాదు మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని ఆయన హితవు చెప్పారు. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని ఆశాభావం వ్యక్తంచేశారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతి నిధిగా ఎన్నికైన అరుదైన ఘనత ఖర్గేది వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: CV Anand: మొహరం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : సిపి సివి ఆనంద్

#BackwardClasses #CasteCensus #Census2025 #CongressGovernment #NationwideCasteSurvey #RevanthReddy #RevanthSpeech #SocialJustice #TelanganaCM Breaking News in Telugu Breaking News Telugu Current News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Sunday Magzine Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Paper Telugu Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu Web Stories in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.