Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ.. సీఎం

Read Time:  1 min
Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ.. సీఎం
FONT SIZE
GET APP

(Revanth Reddy) తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS), బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని ప్రజలు అలోచించి ఓటేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ పాలనను, తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనను బేరీజు వేసుకొని ఓటేయాలని అన్నారు సీఎం రేవంత్.

Read Also: Telangana: సర్పంచ్‌లకు ప్రభుత్వం కొత్త కీలక అధికారాలు

Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ.. సీఎం

కేంద్రంలో గత 11ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలు చేసిందేమీ లేదని అన్నారు. (Revanth Reddy) హైదరాబాద్ కు వరద నష్టాన్ని ఇప్పటికీ కేంద్రం ఇవ్వలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని బండి సంజయ్ అంటున్నారని 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారో ముందు చెప్పాలని గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.గత ప్రభుత్వాలు ఏం చేయలేదని, రెండేళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ఎన్నో హామీలు నెరవేర్చిందని చెప్పారు. ఓటు వేసే ముందు ఓటర్లు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.