📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Revanth Reddy: గ్రామాల అభివృద్ధికి కొత్త మార్గం.. సీఎం కీలక నిర్ణయం

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 5:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొడంగల్(Kodangal) నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల కోసం ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లకు కీలక శుభవార్త చెప్పారు. ఇకపై గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి ఫండ్ అందించనున్నట్లు తెలిపారు.

Read Also: MP DK Aruna: విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం

Revanth Reddy

రాజకీయ జోక్యం లేకుండా గ్రామాలకు నిధులు

ఈ నిధులు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమ అవుతాయని సీఎం స్పష్టం చేశారు. దీంతో అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

తన రాజకీయ జీవితం కొడంగల్ నుంచే ప్రారంభమైందని గుర్తు చేసిన సీఎం, “2009 నుంచి మీరు నన్ను ఆదరించారు. మీ నమ్మకమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని భావోద్వేగంగా మాట్లాడారు. కొడంగల్‌ను దేశానికి ఆదర్శంగా నిలిచే నియోజకవర్గంగా మారుస్తానని అన్నారు.

గ్రామాల్లో ఎలాంటి వివక్షకు తావులేకుండా పాలన సాగాలని, పార్టీ భేదాలు పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్‌లకు సూచించారు. ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కోరారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, గ్రామాలే దేశానికి పునాది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Gram Panchayat funds Kodangal Panchayat Raj Revanth Reddy Sarpanch News telangana cm Telangana politics Village Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.