తెలంగాణ (Telangana) ప్రజల భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అధికారంలో ఉన్నవారు వ్యక్తిగత కోపంతో వ్యవహరించటం మంచిదికాదని అన్నారు.హైదరాబాద్‌లోని టీజీ జెన్కో ఆడిటోరియంలో జరిగిన సభలో, “హసిత బాష్పాలు” పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.తాను అధికారం కోసం కాకుండా ప్రజల సేవ కోసం పని చేస్తున్నానని చెప్పారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తానేనని, తన బాధ్యత ఎంతో గొప్పదని అన్నారు.

వ్యక్తిగత కక్షలతో వ్యవహరించను
ఎవరైనా నచ్చలేదని బాధ్యతను తప్పుగా వాడితే, అది మూర్ఖత్వం అని స్పష్టం చేశారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని, శాంతియుత పాలనకే మొగ్గు చూపుతానని తెలిపారు.తాను కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతానని చెప్పారు. గతంలో ఒక్క మంత్రి పదవీ లేకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరడం కూడా అదృష్టంగా అభివర్ణించారు.డా. అంబేద్కర్ మాటలను ఉదహరిస్తూ, అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదని అన్నారు. పేదవాడు గౌరవంగా బ్రతకడం అనేదే నిజమైన అభివృద్ధని చెప్పారు.
ఉద్యమకారుల త్యాగాన్ని మరువలేం
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది సర్వం కోల్పోయారని గుర్తు చేశారు. నిజమైన ఉద్యమకారులు ఎప్పుడూ తాము ఉద్యమకారులమని చెప్పుకోరని అన్నారు.అందెశ్రీ, గద్దర్ వంటి గొప్ప వ్యక్తులు ప్రజల కోసం స్వార్థం లేకుండా పనిచేశారని అన్నారు. అలాంటి వారే ప్రజలలో మార్పును తీసుకొచ్చారని కొనియాడారు.2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని సీఎం పేర్కొన్నారు. దీని కోసం అన్ని రంగాల్లో మెలకువతో ముందుకు సాగతామని తెలిపారు.శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సుల వల్లే ఈ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని అన్నారు.
Read Also :