రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఆమె భగ్గుమన్నారు. “తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నదంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారు. రాష్ట్రం సమస్యల మీద దృష్టి పెట్టే పరిస్థితి లేద” అంటూ విమర్శలు గుప్పించారు. స్కూటీ, తులం బంగారం వంటి హామీలను గుర్తుచేసి – వాటిలో ఒక్కటైనా అమలు అయ్యిందా అని ప్రశ్నించారు.
రేషన్ బియ్యం నాణ్యతపై ఆరోపణలు
కవిత మాట్లాడుతూ, రేషన్ షాపుల్లో పంపిణీ అవుతున్న సన్న బియ్యంలో 50 శాతం దొడ్డు బియ్యం ఉందని ఆరోపించారు. ఇదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంబులెన్సులకు డీజిల్ పోసే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారని, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకాలను వాడుకునే చర్యలని ఆమె ఆరోపించారు.
ఫ్రీ బస్సు స్కీం పేరుతో గ్రామాలకు నష్టం
ఎమ్మెల్సీ కవిత, ఫ్రీ బస్సు పథకం పేరుతో గ్రామాలకు వెళ్లే బస్సులు తగ్గించారని ఆరోపించారు. “ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయదు. పని చేయించుకోవాలంటే వెంటపడాల్సిందే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కవిత, కాంగ్రెస్ హామీలను నెరవేర్చనందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also : Thavisak :100 బీర్లు తాగి ఒక వ్యక్తి మృతి..ఎందుకంటే?