हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

CM Revanth : చర్చకు రమ్మంటే రేవంత్ ఢిల్లీకి పారిపోయాడు – కేటీఆర్

Sudheer
CM Revanth : చర్చకు రమ్మంటే రేవంత్ ఢిల్లీకి పారిపోయాడు – కేటీఆర్

తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతుల సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసిరిన కేటీఆర్, తాను ప్రెస్ క్లబ్‌కు వచ్చానని, కానీ రేవంత్ ఢిల్లీకి పారిపోయాడని సెటైర్లు వేశారు. “రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకున్నాడు” అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ శ్రేణులు ‘రేవంత్ ఢిల్లీ పరార్’ అంటూ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగునా?

చర్చకు మంత్రులను అయినా పంపుతారని తాను భావించానని కానీ వారు కూడా రాకపోవడం బాధాకరమని కేటీఆర్(KTR) అన్నారు. “చర్చకు సాహసం లేకపోతే, ఇకపై సవాళ్లు చేయకండి” అని హెచ్చరించారు. యూరియా బస్తాల పేరుతో ఢిల్లీకి వెళ్లారని చెబుతున్న రేవంత్ నిజంగా ఏ బస్తాలు మోస్తున్నారో ప్రజలకు తెలుసునని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణ నీళ్లను ఆంధ్రకు పంపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు క్షమాపణ చెప్పే ధైర్యం రేవంత్‌కు ఉండాలని డిమాండ్ చేశారు.

గ్యారంటీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, బాండ్ పేపర్లపై రాసి ఇచ్చిన హామీలు ఎక్కడ అని ప్రశ్నించిన కేటీఆర్, వాటిని పూర్తిగా అమలు చేయకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. 2018లో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటను రేవంత్ తప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇది ఆయన మోసపు రాజకీయాలకు ఉదాహరణ అన్నారు. మళ్లీ ఎప్పుడైనా చర్చకు పిలిస్తే తాను సిద్ధంగా ఉంటానని, ప్లేస్, టైం రేవంత్ డిసైడ్ చేయాలని సవాల్ విసిరారు. “రేవంత్ స్థాయికి మేమే చాలాం… కేసీఆర్ అవసరం లేదు” అంటూ తేల్చేశారు.

Read Also : ఐపీఎల్ బ్రాండ్ విలువలో ఆర్సీబీకి అగ్రస్థానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870