📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Reservation Demand : బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిజెపి ఎంపిలు రాజీనామా చేయాలి

Author Icon By Shravan
Updated: August 4, 2025 • 1:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర (Telangan state) కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలు పార్లమెంటులో ఒత్తిడి చేయాలని.. లేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న ఇందిరాపార్కు దగ్గర మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కులగణన జరిపి దాని ఆధారంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరపడానికి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిసిల రిజర్వేషన్లలను అడ్డుకుంటుందని జాన్ వెస్లీ విమర్శించారు. రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే .. గవర్నర్ కూడా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు కాలయాపన జరుపుతూ, కేంద్రం నుండి గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధులు కూడా రాకుండా బిజెపి ఆటంకం కలిగిస్తుందన్నారు. అసెం బ్లీ సమావేశాల్లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని… బిజెపి మాత్రం బిసి రిజర్వేషన్లలో ముస్లిం లను తొలగించాలనే కుటిల డిమాండ్ను తీసు కొస్తుందన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వే షన్లు అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలు చేయకూడదని చెప్పి అడ్డుపడు తుందని జాన్వెస్లీ విమర్శించారు. ఈ అంశంపై సామాజిక న్యాయం కోరే శక్తులన్నీ ఆలోచిం చాలన్నారు. ముస్లింలలో దూదేకుల, అత్తరాసాహెబ్లు, రాళ్లు కొట్టుకుని బతికేవాళ్లు, పకీర్లు లాంటి చిన్నచిన్న వృత్తులవారు, కూలి చేసుకుంటున్న వారికి బిసి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయన్నారు. డబ్బున్న ధనిక వర్గాలకు కాదని.. హిందూ బిసిలకు రిజర్వేషన్లు అమలు చేసి, ఇస్లాం స్వీకరించిన బిసిలకు రిజర్వేషన్లు ఉండకూడదన్నది ఎట్లాంటి న్యాయమని ప్రశ్నించారు. ఇదెట్లా సామాజిక న్యాయం అవుతుందన్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైందన్నారు. ప్రభుత్వరంగాన్ని ప్రయివేటుపరం చేస్తూ రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని నిరుపయోగంగా చేస్తుందన్నారు. బిసిలకు అనుకూలంగా ఉంటామని, రిజర్వేషన్లను బిజెపి ఎంపిలైన బండి సంజయ్, కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ఎనిమిది మంది బిజెపి (BJP) ఎంపిలున్నారని బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు జరపడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చేయకుండా రిజర్వేషన్లకు అడ్డుపడే చర్యలకు కేంద్రంలోని బిజెపి అడ్డు పడుతోందన్నారు. రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలు పార్లమెంటులో రిజర్వేషన్లకు అనుకూలంగా వ్యవహరించకపోతే వారి రాజీనామాకు ఒత్తిడి చేస్తూ ఆందోళనా కార్యక్రమాలకు చేయాల్సి వస్తుందని జాన్ వెస్లీ హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనా కార్యక్రమాలను నిర్వ హిస్తుందని.. పార్లమెంటులో బిల్లును ఆమోదించి చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ఇందిరాపార్కు దగ్గర మహాధర్నాను నిర్వహి స్తున్నట్టు తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ MORE :

https://vaartha.com/technology-issue-technical-problems-with-gruhajyothi/telangana/525640/

42% Reservation BC Reservations Breaking News in Telugu Indian Politics Latest News in Telugu Reservation Rights Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.