📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Big Relief : KTRకు హైకోర్టులో ఊరట

Author Icon By Sudheer
Updated: April 21, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు రద్దు చేసింది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఓ ఘటనలో, మూసీ నది ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసిందని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయడంతో, ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

న్యాయపరంగా సరైన ఆధారాలు లేవు

KTR చేసిన ఆరోపణలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయంటూ సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు న్యాయపరంగా సరైన ఆధారాలపై ఆధారపడలేదని, వ్యక్తిగత విమర్శల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయపరంగా అన్యాయం అని KTR తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిని పరిశీలించిన హైకోర్టు, ఈ కేసులో ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాలు ఫిర్యాదు కోణానికి సరిపోవడం లేదని స్పష్టం చేసి ఎఫ్ఐఆర్‌ను కొట్టేసింది.

బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు

ఈ తీర్పుతో KTR‌కు పెద్ద ఊరట లభించింది. రాజకీయ విమర్శలను వ్యక్తిగత దూషణలుగా అభివర్ణించడం సరికాదని, విమర్శలకు ప్రతిస్పందన రాజకీయ పరిధిలో ఉండాలంటూ న్యాయస్థానం సూత్రప్రాయంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Big relief ktr Telangana High Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.