📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత

Author Icon By Anusha
Updated: March 11, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజనీర్లు మరియు కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు.టన్నెల్‌లో పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగించేందుకు సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలు ఇప్పటికే 18వ రోజుకు చేరుకున్నాయి. కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ, వాటిని బయటికి తీసుకురావడంలో సహాయక బృందాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. టన్నెల్ లోపల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటమే కాకుండా, బోరింగ్ మెషీన్ భారీ భాగాలు అడ్డుగా ఉండటంతో సహాయక చర్యలు మరింత సంక్లిష్టంగా మారాయి.

ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలు

ఇప్పటివరకు గల్లంతైన కార్మికులలో గురుప్రీత్ సింగ్ అనే మెషీన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. నిన్న మరో రెండు మృతదేహాలు గుర్తించినప్పటికీ, వాటిని వెలికితీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి.బోరింగ్ మెషీన్ భాగాలు అడ్డుగా ఉండటంతో రెస్క్యూ బృందాలు గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

రంగంలోకి రోబోలు

సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇవాళ ప్రత్యేకంగా రోబోలను కూడా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. టన్నెల్ లోపల ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం, వాయువు సరిగ్గా లేకపోవడంతో సహాయక బృందాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రోబోలు ముందుకు పంపి పరిస్థితిని అంచనా వేయాలని అధికారులు నిర్ణయించారు.18 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. టన్నెల్ లోపల బోరింగ్ మెషీన్ లోని మెటల్ భాగాలు అడ్డుగా ఉండటం వంటి అంశాలు సహాయక చర్యలను కష్టతరం చేశాయి.

జీపీఆర్‌ రాడార్‌, ఆక్వా-ఐ పరికరాలను గుర్తించినా,గల్లంతైన వారిని గుర్తించడం సాధ్యం కాలేదు.కేరళ పోలీసులు వినియోగించే క్యాడవర్‌ డాగ్స్‌ను రప్పించారు. బెల్జియం మెలినోయిస్‌ జాతికి చెందిన మాయ, మార్ఫి అనే శునకాలను కేరళ బృందాలు రంగంలోకి దింపాయి. కేరళలో ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువగా ఉండడంతో సుమారు 17 శునకాలను కొనుగోలు చేసి, వాటికి మానవ అవశేషాలను గుర్తించడంలో శిక్షణనిచ్చారు. ఇవి మానవ, జంతు కళేబరాల అవశేషాలను వేర్వేరుగా గుర్తిస్తాయి. నెలలు, సంవత్సరాలు దాటి ఎముకలు మాత్రమే భూగర్భంలో ఉన్నాఇవి గుర్తిస్తాయి.16 రోజుల తర్వాత ఒకరి మృతదేహం బయటపడగా, మిగిలిన వారి కోసం ఇవాళ్టి నుంచి సహాయక చర్యలు మరింత ముమ్మరం కానున్నాయి. బయట పడిన గురుప్రీత్ సింగ్, రాబిన్స్‌ కంపెనీలో టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్‌గా పని చేసే వాడు. వాస్తవానికి టీబీఎం కట్టర్‌కు వెనక భాగంలో మిషన్‌ను ఆపరేట్ చేసే ప్రాంతంలో ఆపరేటర్లు ఉండాలి.

#CadaverDogs #DisasterResponse #EmergencyRescue #NagarKurnool #RescueOperations #RobotAssistedRescue #SearchAndRescue #slbctunnel #SLBCTunnelRescue #TunnelTragedy Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.