📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్లపై రీ-వెరిఫికేషన్‌

Author Icon By Vanipushpa
Updated: January 31, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌కి ముందే.. కీలకమైన 4 పథకాల్ని ప్రారంభించేసింది. దాంతో.. ఇక ఆ పథకాలను ఇబ్బంది లేకుండా కొనసాగించే వీలు కలుగుతోంది. ఆ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2 అప్‌డేట్స్ వచ్చాయి. పథకాలు ప్రారంభించడం తేలికే, అమలు చెయ్యడమే కష్టం. సమస్యలు ఒక రకంగా ఉండవు. అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. అర్హతలు, లబ్దిదారుల ఎంపిక అనేది ఓ పట్టాన తేలదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో అదే జరిగింది. లబ్దిదారుల ఎంపికలో ఏదో తేడా జరుగుతోంది అని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్‌కి డౌట్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అంతా క్లియర్‌గా ఉండాలి అనుకున్న ఆయన.. వెంటనే.. రీ-వెరిఫికేషన్‌కి ఆదేశించారు. అంటే సమస్య మొదటికి వచ్చినట్లే. మీరు ఇందిరమ్మ ఇళ్లకోసం అప్లికేషన్ పెట్టుకొని ఉంటే.. దాన్ని ఆల్రెడీ పరిశీలించి ఉంటే.. ఇప్పుడు మళ్లీ పరిశీలిస్తారు. ప్రతి అప్లికేషన్‌నీ జాగ్రత్తగా చూసి, అప్పుడు మాత్రమే అర్హులను ఎంపిక చెయ్యాలని గౌతమ్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. ఓ సర్క్యులర్‌ రూపంలో ఈ అదేశాలు వెళ్లాయి. ఇప్పుడు మళ్లీ అధికారులకు ఇది పెద్ద సమస్యే.

అసలు ఇలా కొత్త సర్క్యులర్ జారీ చెయ్యడానికి కారణం ఏంటంటే.. ఈమధ్య గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్లకోసం 1 లక్షకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తు పెట్టుకున్న ప్రతీ ఒక్కరూ.. తమకు తప్పకుండా ఇల్లు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత లబ్దిదారుల పత్రాల్ని ర్యాండమ్‌గా పరిశీలిస్తే.. అనర్హులు పత్రాలు పొందినట్లు తేలింది. మొత్తంగా అర్హత కలిగినవారు 5 వేల మంది మాత్రమే ఉన్నట్లు అంచనా. అందుకే మళ్లీ వెరిఫికేషన్ చెయ్యాలని ఆదేశించారు. తొలిదశలో ఎల్1 కేటగిరీలో ఉన్నవారికి మాత్రమే ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారమే ఇప్పుడు రీ-వెరిఫికేషన్ జరగబోతోంది. ఒకవేళ అర్హత లేని వాళ్లు పత్రాలు తీసుకున్నట్లు తేలితే, ఆ పత్రాల్ని వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వం.

Congress government Indiramma Illu Re-verification Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.