తెలంగాణ (RBI) త్వరలో వృద్ధుల రాష్ట్రంగా మారనుందని, సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోవడమే దీనికి కారణమని ఆర్బీఐ నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువ రాష్ట్రం (రైజింగ్ స్టేట్)గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ , మరో పదేళ్లలో ‘ఏజింగ్ స్టేట్’ (వృద్ధ రాష్ట్రం)గా మారనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోవడమే. దీంతో 2036 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి, తెలంగాణ (TG) వృద్ధ రాష్ట్రంగా నిలుస్తుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.
Read Also: Sammakka Saralamma: మేడారంలో మేకలకు టికెట్ వసూలుపై భక్తుల ఆగ్రహం
పనిచేసే జనాభా తగ్గడం వల్ల బడ్జెట్‌పై RBI హెచ్చరిక
ప్రస్తుతం యువత అధికంగా ఉన్న తెలంగాణ, 2036 నాటికి రాష్ట్ర జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 17.1 శాతానికి చేరుకుంటుందని అంచనా సంతానోత్పత్తి రేటు 1.5కి తగ్గడం వల్ల పని చేసే వయస్సు గల జనాభా తగ్గి, వృద్ధులపై ఆధారపడటం పెరుగుతుందని ఆర్బీఐ (RBI) ఆందోళన వ్యక్తం చేసింది.
గణాంకాలను పరిశీలిస్తే, 2016 నుంచి 2026 వరకు రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 10.1 శాతం నుండి 12.5 శాతానికి పెరిగింది. ఇది 2036 నాటికి 17.1 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్ల భవిష్యత్తులో పని చేసే జనాభా తగ్గి, సామాజిక భద్రత, పెన్షన్లు, వైద్య ఆరోగ్య సదుపాయాల కోసం ప్రభుత్వ బడ్జెట్‌పై భారం పెరుగుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ప్రతి 100 మంది పనిచేసే వ్యక్తులపై ఆధారపడే వృద్ధుల సంఖ్య 16గా ఉండగా, 2036 నాటికి ఈ సంఖ్య 26కి పెరుగుతుందని అంచనా. ఈ మార్పు రాష్ట్ర ఖజానాపై, ముఖ్యంగా పెన్షన్లు మరియు వైద్యారోగ్య ఖర్చులపై భారీ ప్రభావం చూపుతుంది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి తెలంగాణ ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: