📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ : సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: February 17, 2025 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అర్హులైన వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన

హైదరాబాద్‌: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పౌరసరఫరా శాఖ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలి ఆదేశించిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి

మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మీ-సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న నేపథ్యంలో.. ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని.. ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు.

ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రేషన్ కార్డులు

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలు మినహాయించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. కాగా.. ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

Breaking News in Telugu CM Revanth Reddy Google news Google News in Telugu Latest News in Telugu New ration cards Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.