📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Tekugu Nesw: Ramchandra Rao: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు: దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం.

Author Icon By Sushmitha
Updated: September 24, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్(Ramchandra Rao) రావు అన్నారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేపట్టడం అన్యాయమని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎందుకు చొరవ చూపడం లేదని రాంచందర్ రావు ప్రశ్నించారు. “పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరుకు నీరు ఆగిపోతే ఎందుకు నోరు మూసుకుంటున్నారు?” అని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపకపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

గత ప్రభుత్వాలపై ఆరోపణలు, విమర్శలు

గతంలో కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణకు నష్టం చేసిందని రాంచందర్ రావు ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీల నీరు మాత్రమే సరిపోతుందని కేసీఆర్ సంతకం చేశారని, అందుకే బీఆర్ఎస్‌కు ఈ విషయంలో మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యాం(Almatti Dam) ఎత్తు పెంపుతో రైతులు నష్టపోతారనే కారణంతో గతంలో సుప్రీంకోర్టు స్టే విధించిందని ఆయన గుర్తుచేశారు.

బిజెపిలో చేరిన నటి వరుణ్ సందేశ్ తల్లి రమణి

మరోవైపు, సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ, సమాజసేవ చేయడమంటే తనకు ఇష్టమని, హిందుత్వ భావాలకు తమ కుటుంబం మద్దతు ఇస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.

ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల ఏ ప్రాంతానికి నష్టం కలుగుతుందని బీజేపీ ఆరోపిస్తోంది?

దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆరోపిస్తోంది.

డ్యాం ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా?

గతంలో సుప్రీంకోర్టు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై స్టే ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Alimatti dam irrigation projects Krishna River water Latest News in Telugu N Ramchander Rao political news. telangana bjp Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.