📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telugu News: Ramchandra Rao: బస్సు ఛార్జీల పెంపు రద్దు చేయాలి

Author Icon By Pooja
Updated: October 7, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ బస్సుల కనీసఛార్జీని ఒక్కసారిగా రూ.10 పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలపై నేరుగా భారం మోపుతుందని, ప్రభుత్వం వెంటనే బస్సు ఛార్జీల పెంపును రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు(Ramchandra Rao) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని, హైకోర్టులో అదే అంశంపై కేసు పెండింగ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు, ముందుగా హైకోర్టులో వాదనలు వినిపించాలి అని చెప్పడం సహజ ప్రక్రియ ఎన్.రాంచందర్రావు(Ramchandra Rao)అన్నారు. అయితే కాంగ్రెస్ మంత్రులు పెద్ద హడావుడి చేసి ఏదో సాధిస్తామంటూ తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లారన్నారు.

Read Also: Crime: ‘నిన్నే పెళ్లాడతా’ అన్న భార్య.. ఆమెను చంపేసి.. భర్త ఏం చేశాడంటే?

దీనిపై క్కే రాజకీయంగా ప్రయత్నిస్తూ, ఏదో సాధించాం అని న్న కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హైకోర్టులో న్యాయనిపుణులతో వాదనలు వినిపించి బిసిలకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో డిస్మిస్ కావడానికి కారణం హైకోర్టులో కేసు పెండిం గ్లో ఉండటం మాత్రమే అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కావాలని బిజెపి మొదటి నుండి కోరుతుందన్నారు.

అందుకు మద్దతు ఇచ్చామని, కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్టీసి బస్సు చార్జీల(RTC bus fares) పెంపు దారుణం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద, మధ్యతరగతి వర్గాలపై సిటీ బస్సు చార్జీల పెంచి భారం మోపిందన్నారు. ఒక చేతితో ఇచ్చి, మరో చేతితో లాక్కోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికకు అభిప్రాయాలు సేకరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, మాజీ ఎంపి రాములు, కోమల ఆంజనేయులు ఉన్నారన్నారన్నారు. కమిటీ ద్వారా పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేసి ప్రకటిస్తామన్నారు.

భారతీయ జనతా పార్టీలో చేరికలు

మహేశ్వరం నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు కొత్తగా పార్టీలో చేరినవారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముస్లిం మైనారిటీలు లబ్ధి పొందుతున్న నేపథ్యంలో, బిజెపిలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగు తున్నాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu Public Transport RTC charges Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.