📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ramagundam NTPC: రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండో దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85శాతం తెలంగాణకే

Ramagundam NTPC: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా రామగుండం ఎన్టీపిసి రెండో దశ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రామగుండంలో ఎన్టిపిసి ఏర్పాటు చేయవలసిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటిదశలో భాగంగా దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 2౧800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2023లో ప్రారంభించి జాతికి అంకితం చేశారన్నారు.

అనంతరం రెండవ దశలో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపిసి చర్యలు చేపట్టిందని వివరించారు. మొదటిదశలో మాదిరిగానే రెండవ దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85 శాతం విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందన్నారు. ప్రస్తుతం సంవత్సరం మార్చి, 3న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందన్నారు.

Read Also: Police Unemployment JAC: తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

Ramagundam NTPC: Hugely increasing electricity demand in the state

బొగ్గు సమీకరణకు ఎన్టిపిసికి తగిన స్వేచ్ఛ ఇవ్వండి

రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుందని తెలిపారు. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని, అందులో భాగంగా ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని తెలిపారు.

పూర్తి 5,800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీక రించుకోవడంలో ఎన్ఐపిసికి తగిన స్వేచ్చను ఇచ్చినట్లయితే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్టీపిసి సిద్ధంగా ఉందన్నారు. మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఎన్టిపిసికి రెండవ దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3,800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పిపిఏ) చేసుకునేలా కృషి చేయాలని సిఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kishan Reddy NTPC Ramagundam Revanth Reddy Telangana Power Demand Thermal Power Project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.