📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Ramachandar Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మాదే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandar Rao) పార్టీ నాయకులు,కార్యకర్తలు, హైదరాబాద్‌ను వీడి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్ వంటి నగర కేంద్రాల్లో మాత్రమే కాకుండా, ప్రతి గ్రామం, ప్రతి ఇంటి దాకా వెళ్లి ప్రజలతో కలవాలని ఆయన సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ (BJP) కి పట్టం కట్టేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలని ఆయన సూచించారు.స్థానిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

కేసీఆర్ మాటలతో పదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కార్యకర్తగా 40 ఏళ్లుగా బీజేపీలో కొనసాగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.బీజేపీ కృషి వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని ఆయన అన్నారు.

Ramachandar Rao

బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ (KCR) మాటలతో పదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాయని ఆరోపించారు.

స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు

కేవలం 600 గ్రూప్-1 పోస్టులను కూడా భర్తీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.42 శాతం బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పై ప్రభుత్వం జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ తగ్గింపును దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని, దీనివల్ల అన్ని సామాజిక వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారని రామచందర్ రావు అన్నారు.

జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోపు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా (Urea) అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. యూరియా బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

BJP campaign strategy Breaking News latest news local body elections Narendra Modi initiatives Ramachander Rao telangana bjp Telugu News welfare schemes promotion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.