తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రాజీవ్ యువ వికాసం పథకానికి (Rajiv Yuva Vikasam Scheme) సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 16.22 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకోగా, జిల్లాల స్థాయిలో కమిటీలు దరఖాస్తుల పరిశీలనను చేపట్టాయి. అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను తుది దశకు తీసుకెళ్తున్నారు.
రేపు ఫైనల్ లిస్ట్ ఖరారు
రేపు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు తుది ఎంపిక జాబితా(Collectors final selection list)ను ఖరారు చేయనున్నారు. జిల్లాల వారీగా ఎంపిక చేసిన అర్హుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియతో పాటు లబ్ధిదారులకు ప్రభుత్వ పత్రాల పంపిణీకి సంబంధిత ఏర్పాట్లు కూడా తుదిదశకు చేరుకున్నాయి.
జూన్ 2 నుంచి మంజూరు పత్రాల పంపిణీ
ఈ ఏడాది ప్రభుత్వం ఐదు లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 2వ తేదీ నుంచి ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఉపాధి, శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల కల్పన కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా రాష్ట్ర యువతకు ఆర్థిక సహాయంతో పాటు జీవితోత్సాహం నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : BYJU’S : గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘బైజూస్’ తొలగింపు