📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rajiv Yuva Vikasam: హోల్డ్ లో యువ వికాసం దరఖాస్తులు

Author Icon By Sharanya
Updated: June 14, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణలో (Telangana) యువ వికాసం స్కీమ్ ను అమలు చేసే ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ యూనిట్లకు వచ్చిన దరఖాస్తులను అధికారులు హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోపక్క ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, అందులో 15.53 లక్షల దరఖాస్తులు వెరిఫై అయ్యాయి. అయితే, వీటిలో 6.6 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. ఈ స్కీము ఈ నెల 2నే తొలి దశ కింద రూ. లక్షలోపు యూనిట్లను మంజూరు చేయాలనుకున్నప్పటికీ అది వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అనర్హులను గుర్తించాలని, అప్లికేషన్లను పునఃపరిశీలించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హోల్డ్లో ఉన్న అప్లికేషన్లు

అప్లికేషన్లను హోల్డ్లో పెట్టాలని కలెక్టర్లకు సర్కారు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ స్కీమ్ అమలులో జాప్యం తప్పదని తెలుస్తోంది. యువ వికాసం పథకం (Yuva Vikasam Scheme) లబ్దిదారుల ఎంపిక బాధ్యత అధికారులదే అని నిబంధన ఉంది. దీని ప్రకారం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారుల అధీనంలో ఉండాల్సి ఉంది. అయితే, తుది జాబితాకు మంత్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు సూచించిన వారినే ఎంపిక చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సూచించిన అభ్యర్థులే ఎంపి ఎంపిక కావడం వల్ల పధకం అమలుకు సంబంధించిన పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

ఇక యువ వికాసానికి రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీలకు సంబంధించి లక్ష 1.55 లక్షల యూనిట్లు కాగా, దరఖాస్తులు మాత్రం 8.01 లక్షలు వచ్చాయి. అలాగే ఎస్సీలకు సంబంధించిన లక్ష 1.44 లక్షల యూనిట్లు కాగా, దరఖాస్తులు 3.92 లక్షలు, ఎస్టీల లక్ష So 91 వేల యూనిట్లుకు గాను దరఖాస్తులు 1.83 లక్షలు, ఈబీసీల లక్ష్యం 51 వేల యూనిట్లకు దరఖాస్తులు 37 వేలు, క్రైస్తవులకు సంబంధించిన లక్ష్యం 5 వేల యూనిట్లకు గాను దరఖాస్తులు 4,604 వచ్చాయి. మొత్తం 5 లక్షల లబ్దిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంతో పాటు, యూనిట్ విలువ తగ్గించుకోవాలని చెప్పినా స్పందన రాలేదు.

Read also: Gaddar Foundation: గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు

#GovernmentSchemes #RajivYuvaVikasam #RevanthReddy #TelanganaYouth #YuvaVikasam Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.