📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rajinikanth: రజనీకాంత్ నిజమైన సూపర్ స్టార్: వీసీ సజ్జనార్

Author Icon By Sharanya
Updated: August 18, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్‌ (Rajinikanth) 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవడం ఆయన అసలైన గొప్పతనానికి నిదర్శనమని సజ్జనార్ (Sajjanar) తెలిపారు. “నిజమైన సూపర్ స్టార్” అనే బిరుదుకు రజనీగానే అర్హుడు అని కొనియాడారు.

Rajinikanth

డబ్బు కోసం సమాజానికి నష్టం కలిగిస్తున్న సెలబ్రిటీలు

ఈ సందర్భంగా సజ్జనార్, ప్రస్తుత కాలంలో కొందరు ప్రముఖుల ఆచరణపై ఆవేదన వ్యక్తం చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ధోరణితో కొందరు కేవలం డబ్బు కోసం సమాజానికి హానికరమైన బెట్టింగ్ యాప్‌లను, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రకటనలు అనేక మంది ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

రజనీ నిర్ణయం – స్ఫూర్తిదాయకం

ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌ (Rajinikanth) తాను అభిమానించే వారిని మోసం చేయకూడదనే నిబద్ధతతో వాణిజ్య ప్రకటనలకు పూర్తిగా దూరంగా (Completely away commercials) ఉండటాన్ని సజ్జనార్ అత్యంత అభినందనీయ నిర్ణయంగా పేర్కొన్నారు. రజనీ యొక్క ఈ వైఖరి నేటి తరం సెలబ్రిటీలకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

సమాజ శ్రేయస్సు కోసం సెలబ్రిటీలు ముందుకు రావాలి

“డబ్బే ముఖ్యం, సమాజం ఏమైపోయినా పర్వాలేదు” అనే ధోరణి నుంచి బయటపడాలని, రజనీకాంత్‌లా ప్రజల శ్రేయస్సును కాపాడే దిశగా ప్రముఖులు ముందుకు రావాలని సజ్జనార్ సూచించారు. ప్రజల జీవితాలతో ఆటలాడే సంస్థల ప్రచారం నుండి పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-news-kukatpally-12-year-old-girl-murder/crime/532016/

Breaking News Celebrities Social Responsibility latest news Rajinikanth Telugu News tollywood VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.